: పాక్ ఆర్మీ యూనిఫాం ధరించిన టెర్రరిస్టుల పనే ఇది: ఆంటోనీ
సరిహద్దుల్లో ఐదుగురు భారత జవాన్ల మరణానికి కారణం పాక్ ఆర్మీ యూనిఫాం ధరించిన సాయుధ టెర్రరిస్టులే అని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ, సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. పూంచ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక దుస్తులు ధరించిన సుమారు 20 మంది సాయుధ ఉగ్రవాదులు ఈ కాల్పులకు తెగబడ్డారని తెలిపారు. ప్రస్తుతం మిలిటెంట్లను ఎదుర్కొనేందుకు భారత సైన్యం అప్రమత్తమైందని మంత్రి పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై భారత్ తన నిరసన తెలుపగా, కాల్పులు తమ సైన్యం పని కాదని పాకిస్తాన్ స్పష్టం చేసింది.