: అరుణగ్రహ యాత్రకు ఇస్రో సన్నాహకాలు
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో భారీ ప్రాజెక్టును చేపట్టింది. ప్రతిష్ఠాత్మక రీతిలో సుమారు రూ.450 కోట్లతో అంగారకుడిపైకి మార్స్ ఆర్బిటర్ మిషన్ యాత్రకు ఏర్పాట్లు ప్రారంభించింది. శ్రీహరికోటలో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్ వీ అనుసంధాన ప్రక్రియ మొదలు పెట్టడం ద్వారా ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చే అక్టోబరులో అరుణగ్రహ యాత్ర ఉంటుందని తెలుస్తోంది. కాగా, ఈ యాత్రకు ఉపయోగించే వాహకనౌకకు సీ-25 అని నామకరణం చేశారు. పీఎస్ఎల్ వీ రాకెట్ రూపొందించి పాతికేళ్ళయిన సందర్భాన్ని పురస్కరించుకుని నౌకకు ఆ పేరు పెట్టారు. కాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అరుణ గ్రహంపైకి క్యూరియాసిటీ రోవర్ ను పంపి నిన్నటికి ఏడాది పూర్తికాగా, భారత్ కూడా అదే రోజు అంగారక యాత్రకు సన్నాహాలు ప్రారంభించడం విశేషం.