: కేంద్రమంత్రి పనబాక ఇల్లు ముట్టడి
కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ఏపీఎన్జీవోలు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పనబాక లక్ష్మి తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే పదవులు అనుభవిస్తూ చోద్యం చూస్తున్నారని ఆమెపై ధ్వజమెత్తారు. పదవుల కోసం చరిత్రహీనులు కావొద్దని పనబాకకు ఉద్యమకారులు సూచించారు. స్వార్థపరులైన నేతల వల్లే ఆంధ్రుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని నినాదాలు చేశారు. తక్షణం పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని వారు డిమాండ్ చేశారు.