: మరో ఫ్రాంచైజీ కొనేందుకు షారుక్ ఆసక్తి
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ త్వరలో ఓ ఫుట్ బాల్ ప్ర్రాంఛైజీని కొనేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇందుకోసం ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. 'ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్' (ఏఐఎఫ్ఎఫ్),'ఐఎమ్ జి-రిలయన్స్' త్వరలో ఫుట్ బాల్ లీగ్ ను నిర్వహించనున్నాయి. ఇందులో కోల్ కతా ప్ర్రాంఛైజీని దక్కించుకునేందుకు బిడ్ వేస్తానని షారుక్ తెలిపాడు. ఇప్పటికే ఐపీఎల్ లో కోల్ కత నైట్ రైడర్స్ పేరుతో ఉన్న ఫ్రాంఛైజీకి ఆయన యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే.
ఓ ఇంటర్వ్యూలో షారుక్ మాట్లాడుతూ..'రాబోతున్న ఫుట్ బాల్ లీగ్ లో కొత్త ఫ్రాంచైజీ(కోల్ కతా)ఉండబోతుంది. నేనూ ఓ జట్టును సొంతం చేసుకోవాలనుకుంటున్నా. కోల్ కతా ఫుట్ బాల్ క్లబ్ అంటే చాలా ఇష్టం' అని చెప్పుకొచ్చాడు. మొత్తం ఎనిమిది క్లబ్బులు పాల్గొనే ఫుట్ బాల్ లీగ్ లో 176 క్రీడాకారులు, 72 మంది ఇతర స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. పదివారాలపాటు లీగ్ జరగనుంది.