: పీఎస్ఎల్వీ-సి20 కౌంట్ డౌన్ ప్రారంభం


శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి మరో ఉపగ్రహం ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 5.56 గంటలకు పీఎస్ఎల్వీ-సి20 అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. కాగా, ఈరోజు ఉదయం 6.56 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.

శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో షార్ డైరక్టర్ ఎంవైఎన్ ప్రసాద్ ప్రయోగ వేళలను ఖరారు చేశారు. కాగా, ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ మొత్తం 59 గంటల పాటు సాగుతుందని షార్ అధికారులు తెలిపారు. ఎలాంటి లోపాలు లేవని నిర్ధారణ అయిన తర్వాత రాకెట్ ప్రయోగం షురూ అవుతుంది.

  • Loading...

More Telugu News