: మరింత కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
మన రూపాయి బక్కచిక్కుతోంది. రోజురోజుకీ విలువ హరించుకుపోతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లో తాజా కనిష్ఠ స్థాయి 61.51కి పడిపోయింది. గతనెల 8న నమోదైన 61.21 ఇప్పటి వరకూ కనిష్ఠ స్థాయిగా ఉండగా.. ఈ రోజు ఆ మార్కును దాటేసింది. దిగుమతి దారులు, బ్యాంకుల నుంచి డాలర్ కు డిమాండ్ రావడం వల్లే రూపాయి విలువ పతనం అయినట్లు ఫారెక్స్ డీలర్లు వెల్లడించారు.