: భారీవర్షంలోనూ ఏయూ విద్యార్థుల దీక్ష


సమైక్యాంధ్ర పట్ల ఏయూ విద్యార్థుల దీక్షాదక్షతను భారీవర్షం సైతం అడ్డుకోలేకపోయింది. ఓవైపు వర్షం కురుస్తున్నా నేడు విశాఖ ఏయూ విద్యార్థులు దీక్ష కొనసాగించారు. క్యాంపస్ లోని గాంధీ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష కొనసాగించిన విద్యార్థి నేతలను నిన్న పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. వారి స్థానంలో వెంటనే మరో బృందం దీక్షకు ఉపక్రమించింది. వీరికి సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు, ఇతర విద్యార్థి సంఘాలు ఏయూకి తరలిరావడం విశేషం.

  • Loading...

More Telugu News