: ఉద్యమం మరో మూడు నెలలు జరగాలి: మాజీ మంత్రి జేసీ
సమైక్యాంధ్ర ఉద్యమం మరో మూడు నెలలపాటు కొనసాగాల్సి ఉందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సమైక్య ఉద్యమంలో పాల్గొన్న జేసీ.. ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుర్యాలీ ప్రారంబించారు. అనంతరం ఉపాధ్యాయులు, ఉద్యోగసంఘాల జేఏసీ రిలే దీక్షల్లో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. తరువాత క్రైస్తవ సంఘాలు చేపట్టిన భారీ ర్యాలీలో పాల్గొన్న జేసీ మాట్లాడుతూ, రాష్ట్ర విభజనపై ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రకటన చేశారని మండిపడ్డారు. విభజనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. హై పవర్ కమిటీ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.