: విద్యుత్ సౌధలో తెలంగాణ ఉద్యోగుల ధర్నా
విద్యుత్ సౌధ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కాగా, ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తెలంగాణ నినాదాలతో విద్యుత్ సౌధను హోరెత్తించారు. ప్రకటనలో తెలిపినట్టుగానే, ఈ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు.