: సోనియానే ఉద్యమం చేయిస్తున్నారు: కిషన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే ఇరుప్రాంతాల్లో ఉద్యమం చేయిస్తోందన్న అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రధాని మన్మోహన్ తన మంత్రులను ఒక్కటిగా నిలపడంలో విఫలమవుతున్నారని, సీమాంధ్రలో ఉద్రిక్తతలు నివారించడంలో ఆయన చేతులెత్తేసినట్టే కనిపిస్తోందని విమర్శించారు. దేశాన్ని సమర్థవంతంగా పాలించడం ఒక్క నరేంద్ర మోడీకే సాధ్యమని, ఆయనకు భయపడే కాంగ్రెస్ తెలంగాణను ప్రకటించిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు సోనియా పావులు కదుపుతోందని, వాటిలో భాగంగానే ఆదరాబాదరాగా రాష్ట్ర విభజన అంశం తెచ్చారని ఆయన మండిపడ్డారు.