: ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం రాజ్యసభ సభ్యురాలిగా కనిమొళి ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన పలువురు ఎంపీలు కూడా ప్రమాణం చేశారు. నేటినుంచి 30 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాగా, కొత్త మంత్రులను ప్రధాని సభకు పరిచయం చేశారు. ఈ సమావేశాల్లో ఆహార భద్రత బిల్లును పాస్ చేయించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తుందనడంలో సందేహంలేదు. అయితే, అది అంత సులభంకాబోదని తెలుస్తోంది. ఆ బిల్లును సమాజ్ వాదీ పార్టీ పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తుండగా, బీజేపీ సవరణలు చేయాలని పట్టుబడుతోంది.