: పార్లమెంట్ ముందు టీడీపీ ఎంపీల బైఠాయింపు
తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు పార్లమెంట్ భవనం ప్రధాన ద్వారం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మోదుగుల, శివప్రసాద్, సీఎం రమేష్, కొనకళ్ళ నారాయణ, సుజనా చౌదరి ఈ నిరసనలో పాల్గొన్నారు. రాహుల్ ను ప్రధాని చేసేందుకే రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అందుకోసమే సీమాంధ్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపించారు.