: షర్మిల పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది: జూపూడి


మరో ప్రజాప్రస్థానం పేరిట వైఎస్సార్సీపీ నేత షర్మిల చేపట్టిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ ముఖ్యుడు జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన షర్మిల పాదయాత్ర 116 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరుకుందని, ఇక్కడితో 3212 కిలోమీటర్ల యాత్ర చేసినట్టయిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇచ్ఛాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు లభిస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శించారు. రాష్ట్ర విభజన చేసి కేంద్రం చారిత్రక తప్పిదానికి పాల్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక మరోనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ రాజకీయంగా ఎదుర్కోలేకే రాష్టాన్ని రెండు ముక్కలు చేశారని ఆరోపించారు. కాగా, షర్మిల పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అంతకుముందు షర్మిల పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని పైలాన్ (విజయస్థూపం) ను ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News