: సమైక్యాంధ్ర ఉద్యమంలో దొంగలు పడ్డారు: ఆనం వివేకా


సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రధాన చర్చనీయాంశంగా మారిన విగ్రహాల ధ్వంసంపై నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తీవ్రంగా స్పందించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, సమైక్యాంధ్ర ఉద్యమంలో దొంగలు పడ్డారని పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్ నేతల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని, తాము కూడా వారి నేతల విగ్రహాలను కూల్చాల్సి ఉంటుందని వివేకా హెచ్చరించారు. రేపటి నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News