: రోడ్డుపైనే కాదు.. నింగిలోనూ ప్రయాణించే సైకిల్
ప్రపంచంలోనే తొలి ఫ్లయింగ్ సైకిల్ ను తాము కనిపెట్టామని బ్రిటన్ డిజైనర్లు ప్రకటించారు. ఈ సైకిల్ రోడ్డుపైనే కాదు.. 40 కిలోమీటర్ల వేగంతో నింగిలోనూ ప్రయాణించగలదట. 4,000 అడుగుల ఎత్తులో విహరించగలదని ఆవిష్కర్తలు జాన్ ఫోడెన్, యానిక్ తెలిపారు. సాధారణ సైకిల్, పారా చ్యూట్ కలబోతగా ఇది ఉంటుంది. ఎక్కడైనా సరే ఎత్తయిన ప్రదేశం నుంచే టేకాఫ్ తీసుకోవచ్చు. దీనికి ఉన్న పారాచ్యూట్, ఫ్యాన్ ను ఆన్ చేయనంత వరకూ ఇది సాధారణ సైకిల్ గానే పనిచేస్తుందని ఆవిష్కర్తలు తెలిపారు.