: విగ్రహాలేంచేశాయి?: బొత్స
సమైక్యాంధ్ర ఉద్యమం తీరుతెన్నులపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఉద్యమకారులు సంయమనం పాటించాలని హితవు పలికారు. జాతీయనేతల విగ్రహాలు ధ్వంసం చేయడం పట్ల స్పందిస్తూ.. విగ్రహాలేంచేశాయని ప్రశ్నించారు. వాటిని కూల్చడం సరికాదన్నారు. తాను త్వరలోనే అధిష్ఠానాన్ని కలిసి విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరతానని వెల్లడించారు. ఇక, కేసీఆర్ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు. హైదరాబాద్ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు.