: సీఎం, బొత్స రాజీనామా చేస్తే అందరూ చేసినట్టే: డీఎల్
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి రాష్ట్ర విభజన అంశంపై స్పందించారు. కడపలో నేడు మీడియాతో మాట్లాడుతూ.. తానూ సమైక్యవాదినే అన్నారు. అందుకే పదవికి రాజీనామా చేస్తున్నాని తెలిపారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్న తరుణంలో, సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స గనుక రాజీనామా చేస్తే అందరూ చేసినట్టే అని వ్యాఖ్యానించారు.