: చిరంజీవి పరపతి ఎంతో తెలిసిందే: జోగయ్య


కేంద్ర మంత్రి చిరంజీవిపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత హరిరామ జోగయ్య విమర్శలు సంధించారు. హైదరాబాద్ లో చిరంజీవి పరపతి ఎంతో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం జోగయ్య విశాఖలో మీడియాతో మాట్లాడారు. మంత్రి సి.రామచంద్రయ్య.. చిరంజీవి వెనుకనుండి నడిపిస్తున్నారని విమర్శించారు. ముందు హైదరాబాద్ సంగతి తేల్చాలని, అనంతరం అక్కడున్న సీమాంధ్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేలా ప్రయత్నిస్తానని చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News