: కేసీఆర్, దిగ్విజయ్ సింగ్ ఇద్దరి వ్యాఖ్యలూ అభ్యంతరకరమే: ఎంపీ నామా
సీమాంధ్రలో ఆందోళనలకు కేంద్రమే బాధ్యత వహించాలని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ తానే ప్రభుత్వం అన్నట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని, ఉద్యోగులను రెచ్చగొట్టడం సరికాదని, ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలని నామా హితవు పలికారు. ఇక, ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్న దిగ్విజయ్ వైఖరిని తప్పుపట్టారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని తెలుగువాళ్లందరి రక్షణకు టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విజయనగరం నుంచొచ్చిన కేసీఆర్ మళ్లీ అక్కడికి వెళ్లిపోయే రోజులు వస్తాయని అన్నారు. తెలంగాణ బిల్లుతో పాటు రాజధాని, విద్యుత్తు, జలాలు, ఉద్యోగ అంశాలపై కేంద్రప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.