: ఏపీఎన్జీవో, టీఎన్జీవో పోటాపోటీ ఆందోళనలు
అబిడ్స్ లోని 'భీమా భవన్' లో ఎపీఎన్జీవోలు ధర్నా చేపట్టారు. దీంతో, వారికి పోటీగా టీఎన్జీవోలు ఆందోళనకు దిగారు. ఇరు ప్రాంతాల ఎన్జీవోలు పోటాపోటీగా సమైక్య, విభజన నినాదాలు చేశారు. దీంతో 'భీమా భవన్' వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి ఇరు వర్గాలను శాంతింపజేశారు.