: జెనీలియాకు చివరి టెలిగ్రాం పంపింది ఎవరు?
నటి జెనీలియా తనకందిన టెలిగ్రాం చూసి మురిసిపోతోంది. ఎందుకంటే అది తన శ్రీవారు రితేష్ దేశ్ ముఖ్ పంపినది కావడమే. గత నెల 15న టెలిగ్రాం చరిత్రలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. 14న చివరి రోజు రితేష్ తనకు పంపిన టెలిగ్రాం కబుర్లను జెనీలియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 'చివరి రోజున మొదటి టెలిగ్రాంను నా భర్త నుంచి అందుకున్నాను. థాంక్యూ రితేష్' అంటూ ట్వీట్ చేసింది. తనకు వచ్చిన టెలిగ్రాంను కూడా ట్విట్టర్లో పెట్టేసింది.