: ఆహార బిల్లు యథాతధంగా ఆమోదించం: సీతారాం ఏచూరి


ఆహారబిల్లులో సవరణలు తీసుకురావాల్సిన అవసరముందని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత బిల్లుతో ఎన్నికల్లో లబ్దిపొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఏచూరి ఆరోపించారు. ఈ బిల్లు వల్ల కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు రూపాయికి కిలో బియ్యం, మరి కొన్ని రాష్ట్రాల్లో ఉచితంగా బియ్యం అందజేస్తున్నాయని.. ఈ బిల్లు కారణంగా ఆ వెసులుబాటు ఉండదని తెలిపారు. కేంద్రమే బియ్యం ధరను నిర్ణయించడం సరికాదని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ కుటిల యత్నాలను అడ్డుకుని తీరతామని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News