: మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించండి: ఆర్ఎస్ఎస్
ఏడాది కాలంగా ప్రధాని అభ్యర్ధిపై భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న తర్జనభర్జనలకు తెరపడింది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధిత్వానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అర్హుడంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ భేటీలో నిర్ణయించింది. వెంటనే మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెప్పింది. అయితే, నవంబర్ లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఈ ప్రకటన చేసి లబ్ది పొందాలని కమలదళం చూస్తోన్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఆర్ఎస్ఎస్, బీజేపీ సమావేశంలో పలువురు ముఖ్య సంఘ్ నేతలు హాజరవగా, బీజేపీ నుంచి రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, మోడీ పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు.