: సచివాలయం వద్ద ఉద్రిక్తత


హైదరాబాదులోని సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉదయం ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయం ప్రధాన ద్వారం వద్ద మంత్రి శైలజానాథ్ ను అడ్డుకున్నారు. మంత్రి రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. దీంతో, పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం సమత బ్లాక్ ఎదుట బైఠాయించిన ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

  • Loading...

More Telugu News