: వైమానికదళం పిల్లతరహా ఎత్తులు


పసిపిల్లల్లో వీడియోగేమ్స్‌ ఆడేవారు ఎక్కువగా కార్‌ రేసింగ్‌ ఆడుతుంటారు. అంతమాత్రాన వాళ్లంతా పెద్దయ్యాక ఎఫ్‌1 కార్‌ రేసర్లు అయిపోతున్నారా? అసలు అది సాధ్యమేనా? కానీ అలా కూడా సాధ్యం అవుతుందేమోననే పిల్ల తరహా ఆలోచనతో స్పందిస్తోంది.. భారతీయ వైమానిక దళం. భారతీయ యుద్ధ విమానాలు, భారతీయ సరిహద్దు వాతావరణం పరిస్థితులు, యుద్ధవిమానాలు వ్యవహరించే తీరు లాంటివాటిని వాడుతూ.. వీడియో ఆటలను రూపొందిస్తే.. పిల్లలు.. వైమానిక దళం పట్ల ఆకర్షితులు అవుతారని, పెద్దయ్యాక భారతీయ వైమానిక దళంలో చేరుతారని వారు ఆశిస్తున్నారు.

అందుకోసం తమ ఎయిర్‌ఫోర్స్‌లోని విమానాల నమూనాలతో వీడియో ఆటల ఆప్స్‌ తయారు చేయాలని రూపకర్తలను కోరుతోంది. ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫారంపై పనిచేసేలా.. తయారు చేయిస్తున్నారట. పిల్లలు విదేశీ యుద్ధాలు మాత్రమే చూడకుండా.. సారీ ఆడకుండా.. ఇక స్వదేశీ విమానాలతో కంప్యూటరు తెరమీద యుద్ధాలు చేసుకోవచ్చునన్నమాట. అయితే పసితనంలో ఆటలు ఆడిన మక్కువతో వాళ్లొచ్చి ఎయిర్‌ఫోర్సులో చేరిపోతారా? అంటే మాత్రం అనుమానమే.

  • Loading...

More Telugu News