: నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాజీనామా
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మస్తాన్ రావు, రామకృష్ణ, వెంకటరత్నం, దుర్గాప్రసాద్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అటు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూడా రాజీనామా చేశారు. తమ లేఖలను స్పీకర్ కు ఫ్యాక్స్ ద్వారా పంపుతున్నట్లు తెలిపారు.ఇక విజయనగరం ఎమ్మెల్యే కోల్ల లలితకుమారి కూడా రాజీనామా ప్రకటన చేశారు.