: సీమాంధ్ర కేంద్ర మంత్రులతో దిగ్విజయ్ భేటీ
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రకటన తరువాత సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తిన పరిస్థితులపై వీరు డిగ్గీరాజాతో చర్చిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తమ నిర్ణయాన్ని సమీక్షించుకునేది లేదని ఉధ్ఘాటించిన దిగ్విజయ్, అల్లర్లు చెలరేగకుండా చూసే బాధ్యత ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలపైనే ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం.