: బీసీసీఐ సమావేశం రద్దు
బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం అనూహ్య పరిణామాల మధ్య రద్దయిపోయింది. శ్రీనివాసన్ అధ్యక్ష స్థానంలో రావడాన్ని సభ్యులు వ్యతిరేకించడంతో సమావేశాన్ని రద్దు చేయక తప్పలేదు. దీంతో, జగ్మోహన్ దాల్మియానే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ విచారణపై ఏర్పాటు చేసిన కమిటీ చెల్లదని, తిరిగి విచారణ కమిటీని కొత్తగా ఏర్పాటు చేయాలని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనివాసన్ మళ్లీ అధ్యక్ష స్థానంలోకి రావడం సమస్యలకు దారితీస్తుందని బోర్డు భావించినట్లుగా తెలుస్తోంది. అలాగే, బాంబే హైకోర్టు తీర్పుపై బీసీసీఐ సుప్రీంలో సవాల్ చేయనుంది.