: బీహార్ లో నీటి కాలుష్యం... 55 మంది విద్యార్థినులకు అస్వస్థత


బీహార్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం వికటించి 27 మంది విద్యార్థులు బలైపోయిన సంఘటన మరువకముందే.. అక్కడే మరో ఘటన చోటు చేసుకుంది. తర్హార్ గ్రామంలో కస్బూర్భా గాంధీ విద్యాలయంలో చేతి పంపు నీళ్లు తాగి 55 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో 48 మందిని ప్రాథమిక వైద్య కేంద్రం, మిగతా వారిని ముజఫర్ పూర్ లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.

  • Loading...

More Telugu News