: రావూరి భరద్వాజకు గౌరవ డాక్టరేట్


సుప్రసిద్ధ రచయిత రావూరి భరద్వాజకు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని గుంటూరు విజ్ఞాన్ యూనివర్శిటీ నిర్ణయించింది. రేపు జరిగే విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం సందర్భంగా భరద్వాజకు ఈ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. వడ్లమూడి విజ్ఞాన్ విద్యాసంస్థల ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. కాగా, రావూరి భరద్వాజకు ఇటీవలే జ్ఞాన్ పీఠ్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. భరద్వాజ రచనల్లో 'పాకుడురాళ్ళు' పాఠకుల అభిమానం చూరగొంది. భరద్వాజ ఈ నవల ద్వారా సినీరంగంలోని చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చారు.

  • Loading...

More Telugu News