: తెలంగాణపై మరోమాటే లేదు: ఏఐసీసీ కార్యదర్శి
తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సీ కుంతియా తెలిపారు. సీమాంధ్ర నేతలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. తెలంగాణ ప్రకటనతో సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కుంతియా నిన్న హైదరాబాదుకు వచ్చారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. అసంతృప్తిగా ఉన్న సీమాంధ్ర నేతలతో చర్చిస్తున్నామని, సీమాంధ్రకు సంబంధించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని వివరించారు. ఇందిర,రాజీవ్ విగ్రహాలను సీమాంధ్ర ఉద్యమకారులు ధ్వంసం చేయడాన్ని ఖండించారు.