: కుక్కల హావభావాలకు భావాలుంటాయి
కుక్క మొరిగితే.. అది ఏం చెబుతోందో మీకు అర్థం కాకపోవచ్చు. కానీ మీరు ప్రేమగా పెంచుకునే కుక్క రకరకాల హావభావాలు ప్రదర్శించిందనుకోండి.. ఒక్కో విన్యాసానికి ఒక్కొక్క సెపరేటు భావం ఉంటుందిట. వాటి గురించి మీకు విపులంగా తెలియజేయడానికి జపాన్ లోని అజబు యూనివర్సిటీ సైంటిస్టులు కుక్కల బాడీ లాంగ్వేజీపై రకరకాల పరిశోధనలు చేశారు. 12 కుక్కల ప్రవర్తనలను పరిశీలించి వారు ఈ అధ్యయనం రిపోర్టును రూపొందించారుట.
ఫరెగ్జాంపుల్ .. వీటి బిహేవియర్ అర్థాలు ఎలా ఉంటాయంటే.. కొత్తవారిని కలిసినప్పుడు కుక్కలు తమ ఎడమ చెవిని వెనక్కు వంచుతాయిట. ఇష్టంలేని వస్తువులను ఇస్తే కుడిచెవిని కదిలిస్తాయిట. కనుబొమలు చెవుల కదలిక ద్వారానే చాలా రకాల సంకేతాలు అవి తెలియజేస్తాయని ఈ నివేదిక చెబుతోంది. కుక్క కనుబొమలు ఎగురవేస్తూ చూసిందంటే.. మీమీద దానికి ప్రేమ చాలా ఉన్నట్లు లెక్క.
ఈ అధ్యయనం ఫలితాలు కుక్కలను పెంచుకునే వారికి ఎంతో ఉపయోగపడుతాయని అంటున్నారు. .. పరిశోధనకు నేతృత్వం వహించిన డా. మిహో నాగసవ. అవునుమరి.. కుక్క మూగభాష తెలిస్తే.. పెంపకం దార్లకు మంచిదేగా?