: నేతలను కదిలించిన సీమాంధ్రుల ఆగ్రహం.. రాత్రికి ఎంపీల సమావేశం
సీమాంధ్రలో రాజుకున్న సమైక్య చిచ్చు ప్రజాప్రతినిధులకు ముచ్చెమటలు పోయిస్తోంది. జనాగ్రహం ఇంత భారీగా పెల్లుబుకుతుందని ఊహించని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్ర విభజన ప్రకటన తరువాత నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా నెలకొన్న పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఈ రాత్రి 10 గంటలకు జరిగే భేటీలో సమాలోచనలు జరుపనున్నారు.