: అవనిగడ్డ ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్ధి నామినేషన్
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్ధి అంబటి హరిప్రసాద్ నామినేషన్ వేశారు. తెలుగుదేశం అవనిగడ్డ ఎమ్మెల్యే అయిన అంబటి బ్రాహ్మణయ్య కొన్ని నెలల కిందట మరణించడంతో ఖాళీ ఏర్పడింది. దాంతో, అవనిగడ్డ ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో, బ్రాహ్మణయ్య కుమారుడైన హరిప్రసాద్ నే టీడీపీ బరిలోకి దింపింది. ఇప్పటికే ఈ ఉప ఎన్నిక బరి నుంచి కాంగ్రెస్, వైఎస్సార్సీపీ తప్పుకోవడంతో ఏకగ్రీవమవుతుందని భావిస్తున్నారు.