: కర్నూలులో కదంతొక్కిన సమైక్యవాదులు... పరిస్థితి ఉద్రిక్తం


కర్నూలులో సమైక్యవాదులు కదంతొక్కారు. ఆందోళనలతో నగరవీధులన్నీ హోరెత్తుతున్నాయి. సీక్యాంపు కార్యాలయంలో ఆందోళనకారులు పోలీసులుపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జీకి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించాయి. డోన్ పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ఆందోళనకారులు రాజీవ్ గాంధీ విగ్రహానికి నిప్పంటించారు. మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిని ముట్టడించి అద్దాలు పగులగొట్టారు.

  • Loading...

More Telugu News