: టీఆర్ఎస్ అర్ధరాత్రి నిర్ణయం.. విజయశాంతి సస్పెన్షన్


తెలంగాణ రాములమ్మను టీఆర్ఎస్ గెంటేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆమెను సస్పెండ్ చేసింది. అర్ధరాత్రి సమావేశమైన టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరాదో తెలియజేయాలని కోరింది. ఆమె నుంచి వివరణ వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో బహిష్కరణ వేటు వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. విజయశాంతి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు వీలుగా ఆ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. దీంతో టీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News