: ప్రజలు మావైపే: హరికృష్ణ


రాష్ట్ర ప్రజలు తెలుగుదేశంవైపే ఉన్నారని ఆ పార్టీ నేత హరికృష్ణ అన్నారు. మూడు దశల పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. అత్యధిక స్థానాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినందుకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, వైఎస్సార్ కాంగ్రెస్ అవినీతిని ఈ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేకించారని చెప్పారు. మరోవైపు, మాజీ మంత్రి పీవీ రంగారావు మృతికి సంతాపం తెలియజేశారు.

  • Loading...

More Telugu News