: బ్యాలెట్ బాక్సులకు నిప్పు పెట్టిన టీడీపీ వర్గీయులు
నల్గొండ జిల్లాలోని పీఏ పల్లి మండలం భీమనపల్లిలో రీకౌంటింగ్ నిర్వహించాలని టీడీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓట్ల లెక్కింపులో సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తూ బ్యాలెట్ బాక్సులు తగులబెట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.