: ఆడి...టెర్రరిస్టులకు సమాధానం చెప్పాలి: అజహారుద్దీన్


భారత ప్రజలు హింసాత్మక చర్యలకు బెదిరిపోరనే విషయం టెర్రరిస్టులకు తెలియజెప్పాలని కాంగ్రెస్ ఎంపి, మాజీ క్రికెటర్ అజహారుద్దీన్ అన్నారు.  హైదరాబాదులో భారత్ ఆసీస్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగాలని..అప్పుడే తీవ్రవాదులకు భారత ప్రజల మనోధైర్యం ఎంత బలమైందో తెలుస్తుందని అజర్ అన్నారు. హైదరాబాదులో ఇలాంటి చర్య జరగటం చాలా బాధాకరమని.. ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని అజహారుద్దీన్ డిమాండ్ చేశారు. ఘటనా సమయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై దర్యాప్తు జరపాలని అజర్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News