: కావూరికి విభజన సెగ
కావూరికి విభజన సెగ తగిలింది. కృష్ణా జిల్లాలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు స్వగ్రామంలో టీడీపీ జెండా ఎగురవేసింది. పెదపారుపూడి మండలం దోసపాడు పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు శివకుమార్ 970 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రాష్ట్ర విభజన చిచ్చే అతని గెలుపుకు కారణమని స్థానికులంటున్నారు.