: కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధం: సర్వే సత్యనారాయణ


కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన ప్రకటన చేయడంతో ఆయనలో ఆనందం పెల్లుబికింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ ఇక టీఆర్ఎస్ ను విలీనం చేసి మాటనిలబెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్.. సోనియా అధినాయకత్వంలో పనిచేయడానికి అంగీకరిస్తే, తాము కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సర్వే చెప్పుకొచ్చారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లుకు ఆమోదముద్ర లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News