: కాంగ్రెస్, టీడీపీ హోరాహోరీ


తుదివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధకార కాంగ్రెస్ కు టీడీపీ సవాల్ విసరుతోంది. దీంతో, పలు జిల్లాల్లో ఈ రెండు పార్టీల మధ్య ఆధిక్యం కోసం హోరాహోరీ పోరు సాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తాజా సమాచారం అందే సమయానికి శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ 50, టీడీపీ 43 పంచాయతీలను కైవసం చేసుకున్నాయి. విశాఖలో టీడీపీ 13, కాంగ్రెస్ 12.. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ 29, టీడీపీ 25.. రంగారెడ్డి జిల్లాలో టీడీపీ 5, కాంగ్రెస్ 4.. కృష్ణా జిల్లాలో టీడీపీకి 34, కాంగ్రెస్ కు 28 పంచాయతీ సర్పంచి పదవులు దక్కాయి.

  • Loading...

More Telugu News