: ముగిసిన తుది విడత పంచాయతీ పోలింగు
రాష్ట్రంలో 5,946 పంచాయతీల్లో తుది విడత పోలింగు ముగిసింది. అక్కడక్కడా చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగు ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒంటిగంట వరకు క్యూలో ఉన్నవారినే ఓటు వేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించనుంది. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. సాయంత్రానికి ఫలితాలు వెల్లడవుతాయి. ముందు వార్డు సభ్యుల ఓట్లు, తర్వాత సర్పంచి అభ్యర్ధుల ఓట్లు లెక్కించనున్నారు.