: పదవికి రాజీనామా చేసిన మరో ఎమ్మెల్యే
కేంద్రం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం పట్ల మరో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు పీడిక రాజన్నదొర రాష్ట్ర విభజనను నిరసిస్తూ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజన్నదొర తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు పంపారు.