: ఉత్తరప్రదేశ్ ను 4 ముక్కలు చేయండి: మాయావతి


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్వాగతించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని మరోసారి డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటును బీఎస్పీ ఎప్పుడూ సమర్థిస్తుందని చెప్పారు. తాము అధికారంలో ఉండగా ఉత్తరప్రదేశ్ ను 4 చిన్న రాష్ట్రాలుగా విభజించాలనే ప్రతిపాదనను కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. దీనిపై నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ ఎంపీలను కోరారు.

  • Loading...

More Telugu News