: ప్రజాభీష్ఠం మేరకే తెలంగాణ నిర్ణయం: జైపాల్ రెడ్డి
తెలంగాణ నిర్ణయం ప్రజాభీష్టం మేరకే వెలువడిందని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో తెలంగాణ అమరవీరుల ఆత్మలకు కాంగ్రెస్ శాంతి చేకూర్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని జైపాల్ రెడ్డి అన్నారు. తాము చేయగలింది చేసామని, తెలంగాణ వాదులే చేసిందంతా చేశారని వారి అభీష్టం మేరకు యూపీఏ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఇక రాష్ట్రం ఏర్పడడమే తరువాయి అని జైపాల్ రెడ్డి అన్నారు.