: తెలంగాణ ప్రకటనపై కేసీఆర్ కామెంట్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రమంటూ చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినా, హైదరాబాదులో సీమాంధ్ర ప్రజల భద్రతకేం ఢోకాలేదని చెప్పారు. నిరభ్యంతరంగా ఇక్కడ ఉండొచ్చని భరోసా ఇచ్చారు. నగరంలో అన్ని జాతుల ప్రజలు నివసిస్తున్నారని, వారిలాగే సీమాంధ్రులు సంతోషంగా ఉండొచ్చని సూచించారు. అనంతరం ఆయన గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.