: బంద్ ఉన్నా పోలింగ్ యధాతథం: ఈసీ


తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం పట్ల సీమాంధ్రలో ఆగ్రహావేశాలు రగులుతున్న నేపథ్యంలో రేపు బంద్ ఉన్న మూడో విడత పంచాయతీ ఎన్నికలు యధాతథంగా జరుగుతాయని ఎన్నికల సంఘం స్పష్ఠం చేసింది. మూడో విడతలో భాగంగా 5,939 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లాలోని 6 గ్రామాలు సహా వాయిదాపడ్డ పంచాయతీలకు ఆగస్టు 8న పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది. కాగా, పోలింగ్ సందర్బంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని జిల్లాల ఎస్పీలకు, కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News