: తెలంగాణ ఏర్పాటు నాలుగు నెలల్లో పూర్తి: దిగ్విజయ్ సింగ్
తెలంగాణ ఏర్పాటు నాలుగు లేక ఐదు నెలల్లో పూర్తి చేస్తామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆయన ప్రకటనకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వీలైనంత త్వరగా పూర్తి చేసి చూపిస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల్లొ విశ్వాసం నెలకొనేలా మరో పది నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో 2014 ఎన్నికల నాటికి తెలంగాణ ప్రక్రియ పూర్తి చేస్తామని దిగ్విజయ్ స్పష్టం చేశారు.