: హైదరాబాద్ కేంద్రపాలనలోకి వెళుతుందా?
హైదరాబాదును పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా యూపీఏ, సీడబ్ల్యూసీ నిర్ణయించాయి. అంటే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమా? ఈ పదేళ్లు ఎవరి పర్యవేక్షణలో హైదరాబాద్ నడుస్తుంది? అంటే హైదరాబాద్ కేంద్రం ఆధీనంలో ఉంటుందా? అలా అయితే కేంద్రపాలిత ప్రాంతంలాగే అన్ని విధివిధానాలు వర్తిస్తాయా? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు చెప్పలేదు. ఇప్పటికే సుమారు 46 ఏళ్లుగా నడుస్తున్న ఛండీఘడ్ (పంజాబ్, హర్యానాలకు ఇది ఉమ్మడి రాజధాని) లాగే హైదరాబాద్ కూడా ఉమ్మడి రాజధాని కానుందా? లోతైన ప్రకటన చేస్తే వివాదమవుతుందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకమైన ప్రకటన చేసిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.